: వాగులో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతు
సమీపంలోని వాగులో స్నానం చేద్దామని వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలోని చిన్న గంగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారు వర్షిత, వర్షిణి, చిన్నిగా గుర్తించారు. వీరు ముగ్గురూ ఎనిమిది సంవత్సరాల లోపు వారే కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు.