: లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా అక్షర విద్యాలయంలో ఏర్పాటు చేసిన చెట్టు-నీరు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లోని ఖాళీ స్థలాల్లో లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించారు. అనంతరం బాబు అక్షర విద్యాలయాన్ని పరిశీలించారు. నెల్లూరులో చంద్రబాబు మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.