: సోషల్ నెట్ వర్క్ నూ వాడుతున్న తీవ్రవాదులు!


సోషల్ నెట్ వర్క్ సైట్లు, నిర్భయ ఘటనపై దేశ యువతను ఉద్యమించేలా చేసింది. అత్యాచార చట్టానికి మార్పులు తీసుకొచ్చేలా చేసిందని సంబరపడుతున్న మనలను నిశ్చేష్టులను చేసే మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదుతో పాటు దేశంలోని పలు నగరాలను బాంబు పేలుళ్లతో భయభ్రాంతులకు గురి చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కూడా సోషల్ నెట్ వర్క్ సైట్లను విరివిగా వాడుతోందట. ఎంతగానంటే, దాడులకు సంబంధించిన ప్రణాళికలను ఉగ్రవాదులు పరస్పరం పంచుకునేందుకు కూడా ఈ సైట్లే వేదికలుగా మారాయట. అంతేనా, తమ సాధన సంపత్తిని పెంచుకునే క్రమంలో చేపట్టాల్సిన చర్యలను పరస్పరం పంచుకునేందుకు కూడా వీటినే ఆశ్రయిస్తున్నారట. ఐఎం వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ కూడా ఈ సైట్ల ద్వారానే తమ సహచరులకు సమాచారం చేరవేశాడని తేలింది. ఈ కఠోర వాస్తవాలను ఢిల్లీ పోలీసులు ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టుకు వెల్లడించారు. ఇటీవల అరెస్టైన ఐఎం ఉగ్రవాదులను విచారించిన సందర్భంగా ఈ విషయాలు వెలుగు చూశాయని తెలిపారు. ఉగ్రవాదులను విచారించిన పోలీసులకు నింబూజ్, యాహూ, పల్టాక్, జీ మెయిల్, ఫేస్ బుక్ తదితరాలకు చెందిన వందలాది ఐడీలు లభించాయట. మరి పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిందే సుమా.

  • Loading...

More Telugu News