: 'ఐస్ బకెట్ చాలెంజ్' తిరస్కరించిన 'బేవాచ్' బ్యూటీ


ప్రపంచ ప్రముఖులందరూ 'ఐస్ బకెట్ చాలెంజ్' కోసం బారులు తీరుతుంటే, 'బేవాచ్' టీవీ సిరీస్ ద్వారా పాప్యులరైన పమేలా ఆండర్సన్ మాత్రం నో చెప్పింది. జంతువుల హక్కుల కోసం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న ఈ సెక్సీ భామ 'ఐస్ బకెట్ చాలెంజ్' గురించి మాట్లాడుతూ, ఈ పోటీ నిర్వహిస్తున్న ఏఎల్ఎస్ సంస్థ జంతువులపై ప్రయోగాలకు దన్నుగా నిలుస్తోందని ఆరోపించింది. మనుషుల వ్యాధులను నయం చేసే ఔషధాలను కనుగొనేందుకు జంతువులను బలిచేయడం క్రూరత్వం అని పమేలా అభిప్రాయపడింది. అందుకే తాను ఏఎల్ఎస్ నిర్వహిస్తున్న ఐస్ బకెట్ చాలెంజ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఫేస్ బుక్ లో తెలిపింది.

  • Loading...

More Telugu News