: శ్రీవారిని దర్శించుకున్న దత్తాత్రేయ, ధనుష్
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సికింద్రాబాదు ఎంపీ బండారు దత్తాత్రేయ, సినీ నటుడు ధనుష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి, వెంకన్న తీర్థప్రసాదాలను అందించారు. ఇవాళ తిరుమలేశుడిని సినీ నటి ప్రణీత కూడా దర్శించుకున్న సంగతి తెలిసిందే.