: శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ప్రణీత
శ్రీనివాసుని దర్శనార్థం సినీ నటి ప్రణీత (అత్తారింటికి దారేది ఫేం) తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రణీత శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రణీతను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.