: మహారాష్ట్ర గవర్నర్ మిజోరాంకు బదిలీ: శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ
మహారాష్ట్ర గవర్నర్ శంకర నారాయణన్ మిజోరాం గవర్నరుగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఏ హయాంలో నియమితులైన శంకర నారాయణన్ ను పదవి నుంచి దిగిపోవాలంటూ మోడీ సర్కారు ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. అయితే శంకర నారాయణన్ అందుకు తిరస్కరించారు. తాజాగా ఆయనను మహరాష్ట్ర నుంచి మిజోరాంకు బదిలీ చేయాలని తీర్మానించిన సర్కారు నిర్ణయాన్ని అనుసరించి రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించాలన్న మోడీ సర్కారు నిర్ణయాన్ని తిరస్కరించిన నారాయణన్, తనను పదవిలో నియమించిన రాష్ట్రపతి కోరితే తప్పకుండా రాజీనామా చేస్తానని గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీని రాజీనామా చేయాలని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఫోనులో ఆదేశించిన విషయంలో ప్రభుత్వ స్పందనను సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.