: రామ మందిరం పునర్నిర్మాణానికి పూనుకోండి: ప్రధానికి సుబ్రహ్మణ్య స్వామి లేఖ


అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణానికి పూనుకోండంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తద్వారా 2016 లోగా రామ మందిరాన్ని నిర్మిస్తామని దేశ ఓటర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని స్వామి తన లేఖలో ప్రధానిని కోరారు. ఈ కార్యాన్ని నెరవేర్చేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి హెచ్.ఎస్. కపాడియా లాంటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని కూడా స్వామి అభిప్రాయపడ్డారు. రామజన్మభూమి తమదేనంటున్న బాబ్రీ మసీదు వంశపారంపర్య హక్కుదారుడు, తన డిమాండ్ ను ఉపసంహరించుకునేందుకు, సరయూ నదిపై ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రభుత్వ సొమ్ముతో మసీదును నిర్మిస్తామని హామీ ఇవ్వాలన్న కేంద్ర మంత్రి వీకే సింగ్ తరహాలోనే స్వామి స్పందించారు. ఇందుకోసం దేశంలోని ముస్లిం మత గురువులతో పాటు విదేశాల్లోని వారిని ఆహ్వానించి చర్చలు జరపాలని సూచించారు. రామ మందిర పునర్నిర్మాణానికి సంబంధించిన బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

  • Loading...

More Telugu News