: అందాల మెరుపులు, తారల తళుకులు... అన్నీ కలిస్తే ‘లాక్మే ఫ్యాషన్ వీక్’
అక్కడ అందాల మెరుపులు కన్పిస్తున్నాయి... తారల తళుకులు కవ్విస్తున్నాయి. ఇవన్నీ కలగలిసి లాక్మే ఫ్యాషన్ వీక్ ఆహ్లాదకరంగా సాగుతోంది. ముంబైలో జరుగుతోన్న ఈ ఫ్యాషన్ షోలో మోడళ్లు సొగసుల నడకతో చూపరులకు మత్తెక్కించారు. బాలీవుడ్ భామలు ర్యాంప్ పై హొయలొలికించి ఈ షోకు మరింత అందాన్ని మోసుకొచ్చారు. సినీ తారలు వాణీ కపూర్, నర్గీస్ ఫక్రీ, గీతా బస్రా అందాల కనువిందు చేశారు. టాలీవుడ్ అందాల నటి శ్రుతి హాసన్ ఈ వేదికపై తళుక్కున మెరిసింది.