: టైగర్ ఉడ్స్ ను తెలంగాణ రప్పిస్తామంటున్న కేటీఆర్


హైదరాబాదులో ప్రారంభమైన నూతన గోల్ఫ్ కోర్స్ లో అంతర్జాతీయ టోర్నీలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గోల్కొండ కోట పక్కనే ఉన్న స్థలంలో నిర్మితమైన 18 హోల్స్ గోల్ఫ్ కోర్స్ మైదానాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ గోల్ఫ్ కోర్సుకు విఖ్యాత గోల్ఫర్ టైగర్ ఉడ్స్ ను రప్పిస్తామని చెప్పారు. కాగా, ఈ మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దారని కేటీఆర్ కితాబిచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు అక్కడ గడిపిన ఆయన తన కుమార్తెతో గోల్ఫ్ ఆడించి ఆ చిన్నారి ముచ్చట తీర్చారు.

  • Loading...

More Telugu News