: గాజా రగడపై మెస్సీ ఫేస్ బుక్ పోస్టింగ్ వివాదాస్పదం
అర్జెంటీనా సాకర్ స్టార్ లయొనెల్ మెస్సీ ఇజ్రాయెల్-గాజా రగడపై ఫేస్ బుక్ లో ఓ పోస్టింగ్ పెట్టగా, అది వివాదాస్పదమైంది. ఇజ్రాయెల్-హమాస్ పోరులో పాలస్తీనాకు చెందిన చిన్నారులు నేలరాలడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానంటూ, గాయపడిన పాలస్తీనా బాలుడి ఫొటో సహా పోస్టు పెట్టాడు మెస్సీ. తాను, ఓ తండ్రిగానూ, యునిసెఫ్ సౌహార్ద్ర రాయబారి గానూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు మెస్పీ పేర్కొన్నాడు. దీనిపై ఇజ్రాయెలీ సోషల్ మీడియా ఖాతాదారులు మండిపడ్డారు. గాజా నుంచి దూసుకువచ్చిన రాకెట్ కారణంగా డానియెల్ ట్రెగరోన్ అనే నాలుగేళ్ళ చిన్నారి శుక్రవారం మరణించాడని, అన్నింటికి మించి ఆ కుర్రాడు మెస్సీ అభిమాని అని పేర్కొన్నారు. ట్రెగరోన్... మెస్సీ పేరున్న జెర్సీని ధరించినప్పటి ఫొటోను వారు పోస్టు చేశారు.