: దేవుడికి మైకులు ఇష్టం ఉండవంటున్న ముస్లిం మతగురువు


పుణ్యక్షేత్రాల వద్ద మైకుల వాడకాన్ని నిషేధించాలంటున్నారు ముస్లిం మతగురువు మౌలానా ఖాలిద్ రషీద్ ఫరాంగి. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 25న విచారణ చేపట్టనుంది. దేవుడు లౌడ్ స్పీకర్ల అవసరం లేకుండానే ప్రార్థనలు, విన్నపాలను వినగలడని ఆయన పేర్కొన్నారు. ప్రార్థనలు తన వరకు చేరడానికి అత్యధిక పౌనఃపున్యం కల ధ్వనులను భగవంతుడు కోరుకోడని ఖాలిద్ వివరించారు. పవిత్ర స్థలాల్లో ఈ లౌడ్ స్పీకర్లు వాడడం కారణంగా ఉత్తరప్రదేశ్ లో తరచూ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. వీటి కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. అందుకే, ఈ లౌడ్ స్పీకర్ల వినియోగం కఠిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News