: తెలంగాణ ఇచ్చి కూడా ఓటమి పాలవడంపై చర్చిస్తాం: దిగ్విజయ్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో దిగ్విజయ్ సింగ్ భేటీ ముగిసింది. హైదరాబాదు గాంధీభవన్ లో జరిగిన ఈ సమావేశంలో మేధోమథన సదస్సు అజెండా ఖరారు చేశారు. తెలంగాణ ఇచ్చి కూడా ఓటమిపాలవడంపై రేపు, ఎల్లుండి చర్చిస్తామని దిగ్విజయ్ తెలిపారు. పార్టీ బలోపేతంపై బూత్ స్థాయి నుంచి సలహాలు స్వీకరిస్తామని అన్నారు. మెదక్ లోక్ సభ స్థానం ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నదానిపై చర్చలు జరుగుతున్నాయని దిగ్విజయ్ చెప్పారు. కాగా, రేపటి నుంచి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరగనున్న మేధోమథనం సదస్సులో మొత్తం పది అంశాలపై చర్చిస్తారు.