: త్వరలో తెలంగాణలో పర్యటించనున్న చంద్రబాబు... స్వయంగా చెప్పిన ఆంధ్రా సీఎం
తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ అధినేత, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన ఈ భేటీలో పలు ముఖ్యాంశాలపై చర్చించారు. త్వరలో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని బాబు తెలిపారు. ప్రతి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో రాష్ట్ర నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతేగాకుండా, నామినేటెడ్ పదవుల్లో తెలంగాణ టీడీపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తామని, ఈ మేరకు కేంద్రంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో తెలంగాణ ప్రాంత నేతలు ముగ్గురికి స్థానం కల్పిస్తామని బాబు స్పష్టం చేశారు.