: మెదక్ ఎంపీ సీటుకు తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ డిమాండ్


మెదక్ ఎంపీ స్థానం నుంచి నిలబడేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి పోటీ చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ ఆసక్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అటు ఆయన భార్య పద్మిని దామోదర్ కూడా నిలబడవచ్చని తెలిసింది. తాజాగా మెదక్ ఎంపీ సీటు తనకే ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత బలరాం నాయక్ పట్టుబడుతున్నారు. ఇవాళ హైదరాబాదు వచ్చిన పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ తో సీినియర్ నేతలు సమావశమై దీనిపై చర్చిస్తున్నారు. అప్పుడే మెదక్ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వాలని డిగ్గీని బలరాం కోరారట. మరోపక్క సర్వే సత్యనారాయణ కూడా పోటీలో వున్నారు.

  • Loading...

More Telugu News