: కూతురి అందం కోసం తల్లి ఘనకార్యం
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ తన కుమార్తె స్లిమ్ గా ఉంటే మరింత అందంగా ఉంటుందని భావించి ఏం చేసిందో చూడండి! ఓ బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనే ముందు ఆమెతో బద్దె పురుగులను తినిపించింది. బద్దె పురుగులు మనిషి పేగుల్లో ఉంటూ, మనం తిన్న ఆహారాన్ని అవి స్వీకరిస్తాయి. తద్వారా మనిషికి తగినంత శక్తి అందక శుష్కించి పోతాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ తల్లి కాస్తా కుమార్తెతో బద్దె పురుగులు తినిపించింది. తద్వారా కుమార్తె బరువు తగ్గి నాజూకుగా తయారవుతుందన్నది ఆమె ఉద్దేశం. అయితే, ఆమె కుమార్తె కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత ఆమెకు గర్భమని భావించారు వైద్యులు. అయితే, ఆమె టాయిలెట్ కు వెళ్ళిన అనంతరం నర్సులు లెట్రిన్ కమోడ్ పరిశీలించగా పెద్ద సంఖ్యలో బద్దెపురుగులు దర్శనమిచ్చాయి. దీంతో, నర్సులు ఆ టీనేజి బాలికను అడగగా, తల్లి తనకు బద్దె పురుగులు తినిపించిన విషయం వెల్లడించింది. ఈ సంగతులన్నీ సదరు టీనేజర్ 'ఫిట్ అండ్ హెల్త్' చానల్లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో వివరించింది.