: కొత్త కారుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న హీరో చరణ్


హీరో రామ్ చరణ్ తాను కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ కారుకు స్వయంగా ఖైరతాబాద్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చరణ్ తన నూతన వాహనం (టీఎస్ 09, ఈబీ 2727)రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా రూ.10వేల రుసుం చెల్లించి డిజిటల్ ప్యాడ్ పై సంతకం చేశాడు. ఈ ప్రక్రియనంతా రవాణా కార్యాలయ అధికారి పూర్తి చేయించారు. చరణ్ తన కొత్త కారు రిజిస్ట్రేషన్ ను తన తండ్రి చిరంజీవి పుట్టిన రోజు(22వ తేదీ) నాడే చేయించుకోవడం విశేషం. గతంలోనూ చెర్రీ ఇలాగే కార్యాలయానికి వచ్చి కారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

  • Loading...

More Telugu News