: 1,427కు చేరిన ఎబోలా మృతుల సంఖ్య: డబ్ల్యూ హెచ్ఓ


పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి వ్యాప్తి చెందిన ప్రాణాంతక వ్యాధి ఎబోలా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,427కు చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ప్రకటించింది. కాగా, ఇప్పటివరకు 2,600కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపింది. మార్చి నుంచి ఈ వ్యాధి పీడితుల సంఖ్య బాగా పెరగింది. కాగా, ఒక్క ఆగస్టు 20 నాడే 77 మంది మృతి చెందారట. ముఖ్యంగా, ఆఫ్రికాలోని లైబీరియా 624 మంది మృతులతో ఎబోలా ప్రభావిత దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. గినియాలో 406 మంది, సియర్రా లియోన్ లో 392 మంది ఈ వ్యాధి బారిన పడి మరణించినట్లు తెలుస్తోంది. 1976లో ఆఫ్రికాలోని జైరే దేశంలో మొదటిసారిగా ఎబోలాను కనుగొన్నారు.

  • Loading...

More Telugu News