: టీడీపీని అడ్రస్ లేకుండా చేస్తామని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో చాలా ఆవేశంతో మాట్లాడారు. టీడీపీని అడ్రెస్ లేకుండా చేస్తామని మైనింగ్ మాఫియా ప్రెస్ మీట్ పెట్టి మరీ బెదిరించిందని, అయితే తాము బెదరలేదని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని టీడీపీ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. సమాజంలో నేరగాళ్ళు లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాలదే అని బాబు ఉద్ఘాటించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలను కాపాడామని చెప్పుకొచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న ఎన్టీఆరే తమకు స్ఫూర్తి అని బాబు నొక్కి చెప్పారు. ఎంత అభివృద్ధి చెందినా, ప్రజలకు భద్రత లేకపోతే అదంతా వృథా అని చెప్పారు. కాగా, ఎర్రచందనానికి అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఏర్పడిందని, దాన్ని దోచుకునేందుకు భారీ నెట్ వర్క్ తో స్మగర్ల ముఠాను ఏర్పాటు చేశారని తెలిపారు.