: సుబేదార్ పతన్ కు వల విసిరింది ఆమె కాదు... అతను!


ఫేస్ బుక్ లో అనుష్క అగర్వాల్ అనే మహిళతో ఏడాదిగా చాట్ చేస్తూ దేశానికి సంబంధించిన సైనిక అంతర్గత రహస్యాలను అందజేసిన సుబేదార్ పతన్ కుమార్ వ్యవహారం సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అతనికి నాడు ఎఫ్ బీలో వల విసిరింది మహిళ కాదు పురుషుడు అని తేలింది. దాంతో, ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ మేరకు సైనికాధికారులు జరిపిన దర్యాప్తులో... మీరట్ సైనిక విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిఫ్ అలీగా నిర్ధారించారు. వెంటనే అతడిపై మీరట్ కొత్వాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అలీని రహస్యంగా విచారిస్తున్నారు. అతడి భార్య పాకిస్థాన్ దేశస్థురాలని, ఆమెతోనే ఎఫ్ బీలో పరిచయం చేయించి, వల విసిరినట్లు నిఘా విభాగం అధికారులు భావిస్తున్నారు. పతన్ తో ఫోన్ లో మాట్లాడింది మహిళే అయినా కథంతా తెరవెనుక నడిపింది అలీనే అని అనుకుంటున్నారు. ఇటు అతడిని తమకు అప్పగించాలని సెంట్రల్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News