: హైదరాబాద్ బిగ్ బజార్ లో చోరీ
హైదరాబాద్ కాచిగూడలో ఉన్న బిగ్ బజార్ షాపింగ్ మాల్ లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 40 ఐఫోన్లు, 15 ల్యాప్ టాప్ లను దొంగిలించారు. చోరీ అయిన వస్తువుల విలువ రూ. 40 లక్షలు ఉంటుందని సమాచారం ఈ చోరీపై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో బిగ్ బజార్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తును ప్రారంభించారు. గతంలో అక్కడ సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన అసోంకు చెందిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.