: మోడీ పాట్నా ర్యాలీ పేలుళ్ల కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ పాట్నా ర్యాలీలో చోటుచేసుకున్న పేలుళ్ల కేసుపై పాట్నా కోర్టులో ఎన్ఐఏ రెండో ఛార్జ్ షీటును దాఖలు చేసింది. నిషేధిత సంస్థ సిమీ సభ్యుడు హైదర్ అలీ సహా పదిమంది పేర్లను అందులో పేర్కొంది. మోడీ లక్ష్యంగా తన అనుచరులతో కలసి అలీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిపింది. ఈ కేసులో ఏప్రిల్లో ఎన్ఐఏ మొదటి అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. కాగా, నాటి పేలుళ్లలో ఆరుగురు చనిపోగా, 89 మందికి గాయాలయ్యాయి.