: మరో 33 రోజుల్లో అంగారక గ్రహం చేరుకోనున్న 'మామ్'
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ప్రతిష్ఠాత్మక మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) మరో ముప్పై మూడు రోజుల్లో అంగారక గ్రహాన్ని చేరుకోనుంది. ప్రస్తుతం అరుణ గ్రహానికి తొంభై లక్షల కిలో మీటర్ల దూరంలో మామ్ ఉందని ఇస్రో వెబ్ సైట్ లో వెల్లడించింది. రూ. 450 కోట్లతో చేపట్టిన ఈ మంగళయాన్ ప్రాజెక్టును గతేడాది నవంబర్ 15న ఏపీలోని శ్రీహరికోట నుంచి పోలార్ శాటిలైట్ వెహికల్ ద్వారా ప్రయోగించారు. సెప్టెంబర్ 24లోగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సమయాన్ని నిర్దేశించారు.