: టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో... ఆల్వాల్ లో పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్


సికింద్రాబాద్ అల్వాల్ లోని జవహర్ నగర్, గబ్బిలాలపేటలో సైబరాబాద్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మల్కాజ్ గిరి డీసీపీ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. గబ్బిలాల పేటలోని ప్రతీ గల్లీ, ప్రతీ ఇంటికి వెళ్లి అణువణువు పోలీసులు సోదా చేశారు. ఇళ్లతో పాటు ఆ ఏరియాలో ఉన్న అన్ని వాహనాలను తనిఖీ చేశారు. పేపర్లు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే, అనుమానితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్ట్ లు ఉన్నారన్న కీలక సమాచారం లభించడంతోనే ఈ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News