: పద్దెనిమిదేళ్లు నిండని కథానాయికలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత


పద్దెనిమిదేళ్లు కూడా నిండని అమ్మాయిలు సినిమాల్లో కథానాయికలుగా చేస్తుండడాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. చలనచిత్రాల్లో 18 సంవత్సరాలు కూడా పూర్తవని అమ్మాయిలను నటింపజేస్తున్నారని... దాంతో, ఆ వయసులో వారికి పరిపక్వత ఉండదని తమిళనాడు మక్కల్ కట్చి రాష్ట్ర కార్యదర్శి ముత్తుసెల్వి తన పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేగాక వారు మానసికంగా, శారీరకంగా వేధింపులకు, కొంతమంది అత్యాచారాలకు కూడా గురవుతున్నారన్నారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే తమిళంలో నటిస్తున్న పలువురి హీరోయిన్ల పేర్లను పిటిషన్ దారు ప్రస్తావించారు. కానీ, పిటిషన్ ను తోసిపుచ్చిన న్యాయస్థానం ఈ విషయంలో తాము కల్పించుకోమని తెలిపింది.

  • Loading...

More Telugu News