: టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మళ్లీ మొదలైన రగడ... సభ 15 నిమిషాల పాటు వాయిదా
ఈ ఉదయం ప్రశ్నోత్తరాలు కొంత సమయం పాటు జరిగిన తర్వాత... అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మళ్లీ రగడ మొదలైంది. జగన్ నిన్న చేసిన బఫూన్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని టీడీపీ సభ్యులు స్పీకర్ వెల్ ను చుట్టుముట్టి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. టీడీపీ సభ్యుల ఆందోళన కారణంగా... స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.