: ప్రత్యర్థి పార్టీ సీఎంలపై ఆ వ్యాఖ్యలేంటీ?: మోడీ తీరుపై అకాలీదళ్ చీఫ్ ఆగ్రహం


ప్రధాని నరేంద్ర మోడీ, తన పర్యటనల్లో భాగంగా బీజేపీయేతర పార్టీ ముఖ్యమంత్రులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తుండటంపై బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ విస్మయం వ్యక్తం చేసింది. మోడీ వ్యవహార సరళి సరికాదంటూ ఆ పార్టీ అధినేత, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ చర్య రాజ్యాంగ విరుద్ధమైనదే కాక విలువల పరంగానూ ఆమోదయోగ్యం కాదని శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అయితే మోడీ వ్యవహార తీరు ఉద్దేశపూరితమైనదా? కాదా? అన్న అంశంపై మాత్రం బాదల్ మౌనం దాల్చారు. మోడీ వ్యవహార తీరు కేంద్రం, రాష్ట్రాల మధ్య అనారోగ్యకర వాతావరణానికి కారణం కాగలదని బాదల్ ఆందోళన వ్యక్తం చేశారు. మోడీకి అత్యంత సన్నిహితుడైన బాదల్, సుదీర్ఘ కాలంగా బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తున్నారు.

  • Loading...

More Telugu News