: రాజీనామా చేయమని ఖురేషీని కోరలేదు: కేంద్ర హోం మంత్రి


ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీని రాజీనామా చేయమని తాము కోరలేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు నియమితుడినైన తనను రాజీనామా చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎలా ఆదేశిస్తారని ప్రశ్నంచిన ఖురేషీ, ఈ విషయంపై కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రంతో పాటు హోం మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు నోటీసుల నేపథ్యంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనిపై స్పందిస్తూ, ‘‘రాజ్ భవన్ ను ఖాళీ చేయాలని ఖురేషీని మేం కోరలేదు. దీనిపై కోర్టుకు తగిన రీతిలో సమాధానం చెబుతాం’’ అని సమాధానమిచ్చారు. యూపీఏ హయాంలో నియమితులైన పలు రాష్ట్రాల గవర్నర్లు బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాల్లో బీజేపీ సర్కారు బలవంతంగా చేయించిన రాజీనామాలే అధికంగా ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. మిగిలిన గవర్నర్లలాగే కేంద్రం ఆదేశించగానే, రాజ్ భవన్ ను ఖాళీ చేసిన గవర్నర్లకు భిన్నంగా అజీజ్ ఖురేషీ, కేంద్రంపై ప్రత్యక్ష యుద్దానికి తెర తీశారు.

  • Loading...

More Telugu News