: సినీ పరిశ్రమను పూర్తిగా తరలించడం సాధ్యం కాదు: సురేష్ బాబు
సినీ పరిశ్రమను హైదరాబాదు నుంచి పూర్తిగా తరలించడం సాధ్యం కాదని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై సినీ రంగ ప్రముఖులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం ముగిసిన అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించమని కోరిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహించే వెసులుబాటు ఉందని ప్రభుత్వం తెలిపిందని ఆయన చెప్పారు. ఏపీలో షూటింగ్ లు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, లోకేషన్ పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు.