: అనంతమూర్తి మృతిపై ప్రధాని సంతాపం... కర్ణాటకలో రేపు సెలవు


ప్రముఖ కన్నడ రచయిత, జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత అనంతమూర్తి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మోడీ ట్విట్టర్ లో తెలిపారు. కాగా, అనంతమూర్తి మృతికి సంతాప సూచకంగా కర్ణాటక ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. శనివారం నాడు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News