: పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు అవార్డు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పోలియో రహిత రాష్ట్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అవార్డు వచ్చిందని, 2008లోనే పోలియో రహిత రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. త్వరలో అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో పీపీపీ విధానాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. మెడికల్ కౌన్సిలింగ్ పై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని కామినేని అన్నారు. రెండు రోజుల్లో ఫీజులపై నిర్ణయం తీసుకుని, మెడికల్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.