: ఇంత పైశాచికత్వమా?... వీరు మనుషులా? మృగాలా?
సగటు మనిషి సిగ్గుతో కుచించుకుపోయే దారుణం హైదరాబాదు సమీపంలో చోటు చేసుకుంది. మనుషుల్లో పశుప్రవృత్తి పెరిగిపోతోందనటానికి తాజా ఘటనే నిదర్శనం. హైదరాబాదులోని పహాడీ షరీఫ్ లో జిమ్ కోచ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మనుషులమనే విచక్షణ మరచి మృగాల్లా ప్రవర్తించారు. ఓ ప్రేమ జంటను ఫాం హౌస్ లో బంధించారు. యువతిపై 9 మంది కాముకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె నగ్నత్వాన్ని ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టారు. అప్పటికీ వారిని వదలని శాడిజం... వారుంటున్న గదిలో పాములను విడిచిపెట్టి పైశాచిక ఆనందం పొందారు. వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ జంట పహడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జిమ్ కోచ్ దయాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖాదర్, తయ్యబ్ తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.