: గుత్తా జ్వాల చెప్పిన బ్యూటీ సీక్రెట్స్


ఆటకు అందం తోడైతే.. గుత్తా జ్వాల అవుతుంది! బ్యాడ్మింటన్ క్రీడలో ప్రపంచస్థాయి వేదికలపై విజయాలు సాధించడమే కాదు, తన సౌందర్యంతో చూపరులను ఆకట్టుకోవడంలోనూ అమ్మడిది అందెవేసిన చేయి. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బొద్దుగుమ్మ అందాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎలా పెంపొందించుకోవాలి? అంటూ పలు విషయాలు వెల్లడించింది.

అందం పట్ల నేటి కాలంలో ప్రతి ఒక్కరికి శ్రద్ధ పెరుగుతోందంటూ.. అందం ద్విగుణీకృతం చేసుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలని చెబుతోందీ స్టార్ షట్లర్. అయితే, అందుకు రోజువారీ వ్యాయామం ఎంతో అవసరం అని సలహా ఇచ్చింది. ఇక వీటన్నింటిని మించి మంచి అలవాట్లు చాలా ముఖ్యమని సూచించింది. బీమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో న్యూ కాస్మెటిక్ క్లినిక్ ను జ్వాల నేడు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News