: ఆ సెన్సార్ అధికారి లంచగొండే: సీబీఐ


గత వారం అరెస్టయిన సెన్సార్ అధికారి లంచగొండేనని సీబీఐ నిర్ధారించింది. అతని లీలలను సీబీఐ అధికారులు వెల్లడించారు. తాజా తమిళ సినిమా 'అంజాన్'కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు రాకేశ్ నగదుతో పాటు ఒక ల్యాప్ టాప్, ఐప్యాడ్ తీసుకున్నాడని సీబీఐ అధికారులు తెలిపారు. పలువురు సినీ నిర్మాతలను బెదిరించి, లంచం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఆగస్టు 9వ తేదీన ‘సికిందర్’ తెలుగు చిత్రానికి రూ.50,000 లంచం తీసుకున్నాడని వారు వివరించారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ, విచారణకు మరింత గడువు కావాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. అతడి కస్టడీని ఆగస్టు 28 వరకూ న్యాయస్థానం పొడిగించింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కు 70 వేల రూపాయలు డిమాండ్ చేసిన రాకేశ్ కుమార్ ఏజెంట్లు డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News