: చేతనైతే ప్రజా ప్రతినిధుల నేర చరిత్రపై శ్వేతపత్రం విడుదల చేయండి: తమ్మినేని సవాలు


శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం అసెంబ్లీని తప్పుదోవలో నడిపిస్తోందని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీకి చేతనైతే ప్రజాప్రతినిధుల నేరచరిత్రపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆయన ఆరోపించారు. పరిటాల రవిది రాజకీయ హత్య కాదని, సెటిల్‌మెంట్ హత్య అని తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిటాలపై అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయన హత్యకు కారకులైన జేసీ బ్రదర్స్‌ను పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని తమ్మినేని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News