: ప్రముఖ కన్నడ రచయిత అనంతమూర్తి కన్నుమూత
ప్రముఖ కన్నడ రచయిత అనంతమూర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత ఇన్ ఫెక్షన్ సోకటంతో ఆయనను పది రోజుల క్రిందట కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ కన్నుమూశారు. 1998లో అనంతమూర్తికి పద్మవిభూషణ్ అవార్డునిచ్చి కేంద్రం సత్కరించింది. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్ పీఠ్ అవార్డును ఆయన 1994లో అందుకున్నారు.