: కాన్వాయ్ లేకుండా జగన్ వెళ్లిపోయారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నిగ్రహం కోల్పోయిన ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాన్వాయ్ లేకుండానే ఇంటికి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేతకు కల్పించాల్సిన భద్రత విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీ వద్ద కాన్వాయ్ పార్కింగ్‌కు స్థలం కూడా కేటాయించలేదని మండిపడ్డ ఆయన కాన్వాయ్ వదిలి ఇంటికెళ్లిపోయారు. పైలట్, ఎస్కార్ట్ కోసం ఇంటెలిజెన్స్ అధికారులు పాత వాహనాలు కేటాయించారు. వాహనాల పనితీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడి భద్రత విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయనకు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.