: ఎయిమ్స్ సీవీఓ తొలగింపుపై కేజ్రీవాల్ మండిపాటు
ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేదిని తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో ఈ చర్య తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. దాంతో, బీజేపీ అసలు అజెండా బయటపడిందని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నారు. ఈ విషయంలో తప్పకుండా సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేగాక చతుర్వేదీని పదవి నుంచి తొలగించిన డాక్టర్ హర్షవర్థన్ రాజీనామా చేయాలని, లేకుంటే ఆయనే మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుందని కేజ్రీవాల్ హెచ్చరించారు.