: పూజల పేరుతో కోట్లు వసూలు చేసిన బురిడీ బాబా అరెస్ట్
పూజల పేరుతో డబ్బు రెట్టింపు చేస్తానని ప్రజలను నమ్మించి కోట్లు వసూలు చేసిన ఆ బురడీ బాబా... చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. తిరుపతిలో అంతరాష్ట్ర మోసగాడు శివ అలియాస్ సూర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు 2007 నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. శివ నుంచి రూ.63 లక్షల నగదు, రెండు కార్లు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.