: ఇది సోనాక్షి సిన్హా అసలు సిసలు ఐస్ బకెట్ ఛాలెంజ్


బాలీవుడ్ సెలబ్రిటీలు ఐస్ బకెట్ ఛాలెంజ్ లో తడిసి ముద్దవుతున్నారు. దీనిపై అవగాహన సంగతి పక్కన పెడితే... ఇదో పబ్లిసిటీ స్టంట్ గా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా... తనను ఎవరూ ఛాలెంజ్ చేయనప్పటికీ ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించింది. ఇది పబ్లిసిటీ వ్యవహారం కాదని చెప్తూ బకెట్ లో ఓ ఐస్ క్యూబ్ వేసుకుని దానిని తలపై పోసుకుంది. విదేశాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని, అలాగే నీరు కూడా అందుబాటులో ఉండడంతో ఐస్ బకెట్ ఛాలెంజ్ చేస్తున్నారని తెలిపింది. భారత దేశంలో అంత చల్లని వాతావరణం ఉండదని, అలాగే అందరికీ సరిపడా నీరు కూడా లేదని చెప్పింది. నీటిని పొదుపు చేయండి... అంటూ సందేశం కూడా ఇచ్చిందీ ముద్దుగుమ్మ. విరాళాలు అందజేయడమే ముఖ్యం తప్ప, నీళ్లు పోసుకోవడం కాదని ఆమె స్పష్టం చేసింది. నీటిని పొదుపు చేయండి...దుబారా చేయకండి అని ఆమె సూచించింది. ఐస్ బకెట్ నెత్తిపై కుమ్మరించుకుని www.als.org సైట్ కి లాగిన్ అయి విరాళాలు అందజేయాలని సోనాక్షి సూచించింది.

  • Loading...

More Telugu News