: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అంధ అభ్యర్థులకు అదనపు సమయం
ఈ నెల 24న జరగనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాసే అంధ అభ్యర్థులకు యూపీఎస్సీ అదనపు సమయం కేటాయించింది. ఈ మేరకు ఓ పబ్లిక్ నోటీస్ విడుదల చేసిన కమిషన్, ప్రాథమిక పరీక్షలో పేపర్-1కు ఇరవై నిమిషాలు, పేపర్-2కు 20 నిమిషాలు కలిపి నలభై నిమిషాలను అంధ విద్యార్థులందరికీ ఇచ్చినట్లు తెలిపింది. కాగా, పేపర్-2లో ఆంగ్ల భాష సామర్ధ్య నైపుణ్యంపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వొద్దని చెప్పింది. వాటి మార్కులను మెరిట్ కు లేదా గ్రేడింగ్ లో కలపబోమని వివరించింది.