: భువనగిరి ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం
తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి రాజయ్య నల్గొండ జిల్లా భువనగిరి ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న అసౌకర్యాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాల గురించి రోగులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో భోజనాన్ని పరిశీలించిన రాజయ్య... ‘ఇదేం భోజనం?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని సౌకర్యాలపై 48 గంటల్లో నివేదిక సమర్పించాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.