: ఎబోలా భయంతో నాలుగు ఆఫ్రికన్ దేశాలకు వీసా నిరాకరించిన శ్రీలంక
ఎబోలా మహమ్మారి భయంతో పొరుగుదేశం శ్రీలంక జాగ్రత్త వహిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యటన కోసం తమ దేశానికి వచ్చే నాలుగు ఆఫ్రికన్ దేశాలకు వీసా నిరాకరించింది. ఈ మేరకు నైజీరియా, లైబీరియా, సియర్రా లియోన్, గునియా నుంచి వచ్చే వారికి ఎంట్రీ వీసాను పొందే హక్కును తాత్కాలికంగా తొలగించినట్లు లంక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ ముందస్తు విన్నపంతోనే వీసా సస్పెండ్ చేసినట్లు వారు వివరించారు. తదనంతరం నోటీసు వచ్చేవరకు ఇది కొనసాగుతుందన్నారు.