: హైదరాబాద్ పై గవర్నర్ అధికారాలపై అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?: అశోక్ గజపతిరాజు


తెలంగాణ రాష్ట్ర అధికారాలను గవర్నర్ హరిస్తున్నారనుకుంటే ఆ రాష్ట్ర నేతలు కోర్టును ఆశ్రయించవచ్చని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విభజన బిల్లులో ఉన్న అంశాలనే కేంద్రం అమలు చేస్తుందని అన్నారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు పాస్ అయినప్పుడే ఆ అంశాలపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని కావడం వల్లే గవర్నరుకు అధికారం ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. స్థానికతకు 1956 ప్రామాణికత కాదని రాజ్యాంగం స్పష్టమైన సూచన ఇచ్చిందని అశోక్ గజపతిరాజు తెలిపారు.

  • Loading...

More Telugu News