: కమల్ నాథన్ కమిటీని కలిసిన టీఎన్జీవో ప్రతినిధులు
ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటయిన కమల్ నాథన్ కమిటీని టీఎన్జీవో ప్రతినిధులు హైదరాబాదులో కలిశారు. విభజన మార్గదర్శకాలు ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఉన్నాయని టీఎన్జీవో నేత దేవీప్రసాద్ అన్నారు. 18 ఎఫ్ మార్గదర్శకాల్లో మార్పులు చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ నెలాఖరు నాటికి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని దేవీప్రసాద్ కమల్ నాథన్ కమిటీని కోరారు.