: తీవ్ర గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేసిన స్పీకర్


ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు పదినిమిషాల వాయిదా అనంతరం సభ ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా టీడీపీ, వైసీపీ సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో... సభలో గందరగోళం నెలకొంది. వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు స్పీకర్ వెల్ ను చుట్టుముట్టి ఆందోళన చేయడం మొదలుపెట్టారు. గందరగోళం మధ్యే ప్రతిపక్ష నాయకుడు జగన్ తన వ్యాఖ్యలపై సభకు క్షమాపణ తెలియచేయాలని స్పీకర్ కోరారు. అయితే జగన్ తన వ్యాఖ్యలను వెనక్కితీసుకునేందుకు నిరాకరించడంతో... సభలో మళ్లీ అలజడి మొదలయ్యింది. ఇరు పక్షాల మధ్య ఘర్షణ తీవ్రతరం అవుతుండడంతో... స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభను శనివారం ఉదయం 9గంటలకి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News