: నన్ను హంతకుడు, నరరూప రాక్షసుడన్నారు...నాకు బాధ కలగదా?:బఫూన్ వ్యాఖ్యలపై జగన్
బఫూన్ వ్యాఖ్యలపై జగన్ ప్రతిస్పందించారు... ఇదే సభలో టీడీపీ సభ్యులు తనను హంతకుడు అన్నారని... నరరూపరాక్షసుడు అన్నారని వైఎస్ జగన్ అన్నారు. తమ ఎమ్మెల్యేలను స్మగ్లర్లు అని కూడా అన్నారని జగన్ వ్యాఖ్యానించారు. తనను అలాంటి ఘోరమైన మాటలతో దూషించిన తర్వాత... తాను కేవలం వారిని బఫూన్లు అన్నానని వైఎస్ జగన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.