: శరద్ పవార్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన దిగ్విజయ్
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ను తిరిగి కాంగ్రెస్ లోకి రావాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆహ్వానించారు. ఇద్దరం కలసి బీజేపీని ఓడించేందుకు చేతులు కలుపుదామన్నారు. "కాంగ్రెస్ లో పలువురి ఆసక్తి మేరకు, ప్రజాస్వామ్యం మేరకు పవార్ ను మళ్లీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం. మత, వేర్పాటువాద శక్తులను అరికట్టేందుకు కలవాల్సి ఉంది" అని సోలాపూర్ లో మీడియాతో అన్నారు. కాగా, కాంగ్రెస్ తో విభేదాల కారణంగా దశాబ్దం కిందట పవార్ ఎన్సీపీని స్థాపించారన్న డిగ్గీ కాంగ్రెస్, ఎన్సీపీల భావజాలం ఒకేలా ఉంటాయన్నారు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పవార్ కాంగ్రెస్ లో చేరుతారని అనుకుంటున్నామని పేర్కొన్నారు.