: మనిషిని ఖూనీ చేసే స్థాయికి రాజకీయవ్యవస్థ దిగజారింది: అసెంబ్లీలో జగన్
అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో వైఎస్ జగన్ ఆవేశంగా ప్రసంగించారు. మనిషిని ఖూనీ చేసే స్థాయికి రాజకీయవ్యవస్థ దిగజారిందని వైఎస్ జగన్ ఆవేశంగా అన్నారు. తాము హత్యా రాజకీయాలను ఇకపైనైనా కంట్రోల్ చేయమని ప్రభుత్వాన్ని కోరుతుంటే... ఒక్క మంత్రి కూడా ఆ హామీ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. చనిపోయిన వ్యక్తులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని మాత్రమే తాము కోరామని... దానికి కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదని ఆయన అన్నారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.