: వైఎస్ ప్రాణాలు పోసే వ్యక్తి... ప్రాణాలు తీసే వ్యక్తి కాదు: అసెంబ్లీలో కొడాలి నాని
అసెంబ్లీలో చర్చలో టీడీపీ సభ్యులు మాట్లాడిన తీరు చూస్తుంటే... వైసీపీ కార్యకర్తలపై హత్యలు ఇకపై కూడా కొనసాగుతాయేమోనని అనిపిస్తోందని కొడాలి నాని అన్నారు. దురుద్ధేశంతోనే పరిటాల రవి హత్యకేసులో వైఎస్ జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వృత్తిరీత్యా డాక్టర్ అని... ఆయన ప్రాణాలు పోసే వ్యక్తే గానీ... ప్రాణాలు తీసే వ్యక్తి కాదని కొడాలి నాని అన్నారు.